పుష్ప 2: ది రూల్ – భారతీయ కమర్షియల్ సినిమా కొత్త అధ్యాయం

పుష్ప 2: ది రూల్ - భారతీయ కమర్షియల్ సినిమా కొత్త అధ్యాయం
Telegram Group Join Now
WhatsApp Group Join Now

పుష్ప 2: ది రూల్ – భారతీయ కమర్షియల్ సినిమా కొత్త అధ్యాయం

భారతీయ సినిమాల్లో కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనాన్ని అందిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’, బాక్సాఫీస్ వద్ద విజయవిహారం చేస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,508 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.

ఈ చిత్రం ‘కేజీఎఫ్ 2’ (రూ. 1,250 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ. 1,387 కోట్లు) కలెక్షన్లను దాటేసి, ‘బాహుబలి 2’ (రూ. 1,810 కోట్లు) కలెక్షన్లను దాటేందుకు సిద్ధంగా ఉంది. భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లతో అగ్రస్థానంలో ఉన్న ఆమిర్ ఖాన్ ‘దంగల్’ (రూ. 2,024 కోట్లు) రికార్డును కూడా ఇది బద్దలు కొట్టే అవకాశముంది.

ముంబై సర్క్యూట్‌లో రూ. 200 కోట్లు (నెట్) వసూలు చేసిన తొలి చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించిందని చిత్ర బృందం ప్రకటించింది. హిందీలో మాత్రమే రూ. 618.50 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు తెలుస్తోంది.

‘పుష్ప 2’ ఘనతలు

2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రష్మిక మందన్న (శ్రీవల్లి), ఫహద్ ఫాజిల్ (భన్వర్ సింగ్ శేఖావత్), అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్లు వసూలు చేసి, కొత్త రికార్డు సృష్టించింది. ‘పుష్ప 2’ కమర్షియల్ సినిమాల సత్తాను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అని చెప్పుకోవచ్చు.

‘పుష్పరాజ్’ విజయం వెనుక అనేక కృషులు ఉండగా, ఈ విజయ గాధ ఇంకా కొనసాగుతున్నది