🇮🇳 “మేము కిరానా హిల్స్ పై దాడి చేయలేదు” — ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టీకరణ!

Telegram Group Join Now
WhatsApp Group Join Now

🇮🇳 “మేము కిరానా హిల్స్ పై దాడి చేయలేదు” — ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టీకరణ!

భారత వాయుసేన ఓపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కిరానా హిల్స్ లో ఉన్న న్యూక్లియర్ నిల్వలపై దాడి చేశామనే వార్తలు సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియాలో ఊహాగానాలకు దారి తీసిన నేపథ్యంలో, ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టంగా స్పందించారు.
“కిరానా హిల్స్ పై మేము ఎలాంటి దాడి చేయలేదు. మా టార్గెట్ లిస్ట్ లో అది లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

🧨 పాక్ కిరానా హిల్స్… భూకంపాలకి కారణం భారత దాడులా? – కన్‌స్పిరసీ థియరీస్ కి ఫుల్ స్టాప్

పాకిస్థాన్ లో ఇటీవల సంభవించిన భూకంపాలు, కిరానా హిల్స్ వద్ద న్యూక్లియర్ నిల్వలపై భారత దాడులు జరిగాయనే అబద్ధపు ప్రచారాలకు సోషల్ మీడియాలో ఊపొచ్చింది. అంతేకాదు, అమెరికా, ఈజిప్ట్ విమానాలు అక్కడ కనిపించాయంటూ, న్యూక్ లీక్ జరిగినదేనా? అనే డౌట్లను కలిగించాయి. కానీ భారత వాయుసేన మాత్రం ఈ రూమర్స్ అన్నింటినీ ఖండించింది.

🚀 “ఓపరేషన్ సిందూర్: టెర్రరిజానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్ ఆర్మీ మద్దతు బాధ్యతగా మారింది”

ఓపరేషన్ సిందూర్ గూర్చి వివరిస్తూ, భారత వాయుసేన చెప్తోంది: “మా లక్ష్యం టెర్రరిస్టులు మరియు వారి మద్దతుదారులే. పాకిస్థాన్ మిలిటరీ వారిని రక్షించడానికి ముందుకు రావడం వల్ల, మేము ప్రతిస్పందించాల్సి వచ్చింది.”
ఈ దాడుల్లో టర్కిష్ డ్రోన్లు, చైనీస్ PL-15 మిసైల్ మిగతా శస్త్రాల శకలాలు చూపిస్తూ భారత్, ఇది ఆత్మరక్షణ దాడి మాత్రమేనని పేర్కొంది.

Leave a Comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now