Tag: iPhone 17 Pro కెమెరా భారీ అప్‌డేట్: 48MP టెలిఫోటో

  • iPhone 17 Pro కెమెరా భారీ అప్‌డేట్: 48MP టెలిఫోటో, 24MP సెల్ఫీ కెమెరా లీక్!

    iPhone 17 Pro కెమెరా భారీ అప్‌డేట్: 48MP టెలిఫోటో, 24MP సెల్ఫీ కెమెరా లీక్!

    📸 iPhone 17 Pro సిరీస్ భారీ కెమెరా అప్‌గ్రేడ్‌కి సిద్ధం! – 48MP టెలిఫోటో లెన్స్ వచ్చింది!!

    ఐఫోన్ అభిమానులకి సూపర్ న్యూస్! కొత్తగా లీకైన వివరాల ప్రకారం, iPhone 17 Pro & 17 Pro Max మోడల్స్‌లో కెమెరా సెటప్ పూర్తిగా మారబోతోంది. 12MP టెలిఫోటో లెన్స్ స్థానంలో, Apple ఇప్పుడు 48MP టెలిఫోటో లెన్స్ తీసుకురానుంది – ఇది పెద్ద అప్‌గ్రేడ్.

    🔍 మూడు కెమెరాలూ 48MP? Apple గేమ్ మార్చే సిగ్నల్స్ ఇస్తోందా?

    ఈ ఏడాది iPhone 17 Pro సిరీస్‌లో ఉండే ట్రిపుల్ కెమెరా సెట్‌అప్ మొత్తం 48MP లెన్సులతో రానుందన్న ఆశాజనకమైన లీక్స్ వచ్చాయి. వేరియబుల్ అప్టర్చర్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని, గత కొన్ని వారంలుగా లీకులలో ప్రచారం జరుగుతోంది.

    🤳 ఫ్రంట్ కెమెరా కూడా 24MP? Apple నుండి ఇప్పటివరకు లేని భారీ జంప్!

    Apple ఎప్పుడూ ఫ్రంట్ కెమెరాలో పెద్ద మార్పులు చేయకపోయినా, ఈసారి 24MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం. ఇది Apple కెమెరా హిస్టరీలోనే అతిపెద్ద ఫ్రంట్ కెమెరా అప్‌గ్రేడ్ అవుతుంది.